BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 17 June 2026, 10:18 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో బిజెపి BLO లు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 10:18 AM
110 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ సమగ్ర జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు అసెంబ్లీ చాట్రాయి మండలంలోని 51 పోలింగ్ బూత్ పరిధిలో ప్రభుత్వ BLOలు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

చనుబండ గ్రామపంచాయతీ బూత్ నంబర్ 3, 4 పరిధిలో ప్రభుత్వ BLOలు కోటేశ్వరరావు, మురళీమోహన్ ఆధ్వర్యంలో SIR కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బిజెపి BLO-2లు బుర్రి సుమలత, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీకర్ బుర్రి మాట్లాడుతూ, సమగ్ర ఓటర్ జాబితా ద్వారా అర్హులైన కొత్త ఓటర్ల పేర్లు నమోదు కావడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలు సవరించడం, అలాగే ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న ఓటు నమోదులను తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియతో ఖచ్చితమైన ఓటర్ జాబితా తయారవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగి మంచి ప్రభుత్వం ఏర్పడేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. BLOలు ఇంటింటికి వచ్చినప్పుడు సరైన వివరాలు అందించి, తమ పేరు ఓటర్ జాబితాలో ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలని, తప్పులు ఉంటే సవరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అలాగే అన్ని రాజకీయ పార్టీల పోలింగ్ బూత్ స్థాయి ప్రతినిధులు (BLO-2) సహా సంబంధిత అధికారులు నిబద్ధతతో, అవినీతి రహితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పరస శ్రీనివాసరావు (టీడీపీ), తేనేటి వేణు (టీడీపీ), తాళ్లూరి గోపి (వైసీపీ) తదితరులు, అలాగే పలువురు ఓటర్లు పాల్గొన్నారు.