BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 23 August 2026, 06:31 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చత్తీస్‌గఢ్ ఎంసీబీ జిల్లాలో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:31 AM
84 వీక్షణలు

చత్తీస్‌గఢ్ ఎంసీబీ జిల్లాలో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం

చత్తీస్‌గఢ్‌లోని ఎంసీబీ (మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్) జిల్లా పరిధిలో ఓ మహిళపై జరిగిన అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు యువకులు మహిళను బలవంతంగా కారులో ఎక్కించుకుని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పర్దుంగా అటవీ ప్రాంతంలో నిందితులు ఆమెపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసేందుకు శరీరంపై మద్యం పోసి నిప్పంటించే ప్రయత్నం చేసినట్లు తెలిపింది.

అయితే అదే సమయంలో భారీ వర్షం కురవడంతో అగ్గిపెట్టె తడిసి మంటలు అంటుకోలేదు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడిన బాధితురాలు నిందితుల నుంచి తప్పించుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసి, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

ఘటన జరిగి 24 గంటలు గడిచినా నిందితులు ఇంకా పట్టుబడలేదని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.