BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 18 February 2026, 07:26 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మసీదుల వద్ద సమగ్ర సదుపాయాలు కల్పించాలి

తెలంగాణ
18 Feb, 2026 - 07:26 AM
347 వీక్షణలు
రంజాన్ సందర్భంగా మసీదుల వద్ద సమగ్ర సదుపాయాలు కల్పించాలి: అదనపు కలెక్టర్ NTODAY NEWS: యాదాద్రి భువనగిరి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని మసీదుల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మినీ మీటింగ్ హాలులో నిర్వహించిన శాంతి సంఘ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. రంజాన్ ఏర్పాట్లపై కేటాయించిన విధులను శాఖల మధ్య సమన్వయంతో నిర్వహించాలని తెలిపారు. నమాజ్ సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, కరెంట్ సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టి, తాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ వార్డుల్లో తాగునీరు సమయానికి అందేలా పర్యవేక్షించాలని చెప్పారు. జిల్లాలో రంజాన్ మాసం సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా జిల్లాను నిలపాలని పిలుపునిచ్చారు. అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. అందరి సహకారంతో సామరస్య వాతావరణంలో వేడుకలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, పోలీసు అధికారులు, మత పెద్దలు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. #Ramzan2026 #YadadriBhuvanagiri #PeaceCommittee #DistrictAdministration #PublicFacilities Follow us on Website Facebook Instagram YouTube