BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 09 February 2026, 06:58 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ధర్మపురిలో కాంగ్రెస్ భారీ ఎన్నికల ర్యాలీ

తెలంగాణ
09 Feb, 2026 - 06:58 AM
229 వీక్షణలు
అవినీతి చేతుల్లో మున్సిపాలిటీ పెడితే పట్టణానికి ప్రమాదం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలో కాంగ్రెస్ భారీ ఎన్నికల ర్యాలీ మున్సిపల్ అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ధర్మపురి మున్సిపాలిటీని అవినీతి పరుల చేతుల్లో అప్పగిస్తే పట్టణం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధిగా మలిచినట్లు పేర్కొన్న ఆయన, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనున్న నేపథ్యంలో సోమవారం ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. పటేల్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్, నంది చౌరస్తా, అంబేద్కర్ జంక్షన్ మీదుగా ఎస్‌.హెచ్‌. ఫంక్షన్ హాల్ వరకు సాగింది. వేలాది మంది కార్యకర్తలు, మహిళలు పాల్గొనడంతో పట్టణం జనసంద్రాన్ని తలపించింది. గత పదేళ్ల పాలనపై విమర్శలు పటేల్ చౌరస్తాలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్మపురి అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నప్పటికీ పట్టణాన్ని అవినీతికి కేంద్రంగా మార్చారని విమర్శించారు. మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ జెండాలతో హోరెత్తిన పట్టణం ఎన్నికల ప్రచార చివరి రోజున ధర్మపురి వీధులన్నీ కాంగ్రెస్ త్రివర్ణ పతాకాలతో నిండిపోయాయి. 15 వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజల మధ్యకు వెళ్లి మంత్రి మద్దతు కోరగా విశేష స్పందన లభించింది. 15 వార్డుల్లోనూ కాంగ్రెస్ కౌన్సిలర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలతో సహపంక్తి భోజనం ప్రచారం అనంతరం ఎస్‌.హెచ్‌. గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మహిళలు, పార్టీ కార్యకర్తలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. #DharmpuriMunicipalElections #CongressCampaign #AdluriLaxmanKumar #MunicipalElections2026 #UrbanDevelopment #TelanganaPolitics #CongressRally Follow us on Website Facebook Instagram YouTube