BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 29 March 2025, 04:30 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు అధైర్య పడొద్దు-ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

తెలంగాణ
29 Mar, 2025 - 04:30 AM
204 వీక్షణలు
N TODAY NEWS: బొమ్మలరామారం మండలం, మార్చ్ 29 జై బాపు జైభీం జై సంవిధాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు సంవత్సరం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించానున్నారు.ఈ మేరకు బొమ్మాలరామారం మండలం యావపూర్ గ్రామంలో శనివారం రోజున జైబాపు జైభీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఈ కార్యక్రమ ఇంఛార్జి బొజ్జ సంధ్య రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరైయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువల పై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.నేడు పేద బలహీన వర్గాలప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని,ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులే ముఖ్యం అన్నారు.రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు అంబెడ్కర్,గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు.పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబెడ్కర్ ని పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు .గ్రామ మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కోరారు.గాంధీ,అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఒక్కొకటి అమలుపరుస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన పథకాలను కూడా కొనసాగిస్తుందన్నారు. కానీ బిఆర్ఎస్ నాయకులు పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న పనులను ఓర్వలేక వ్యతిరేకమైన అంశాలను సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతుందని అన్నారు. బొమ్మలరామారం మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు అధైర్య పడకుండా ముందుకు సాగాలన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులను తప్పులను సరిదిద్దుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని చేస్తున్నారని మన గ్రామాలలో కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా అధికారులతో మంత్రులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తానని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు అండం సంజీవరెడ్డి, మదర్ డైరీ చైర్మన్ గూడిపాటి మధుసూదన్ రెడ్డి, మండల అధ్యక్షులు సింగిర్తి మల్లేశం, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ రాములు నాయక్, మహిళా అధ్యక్షురాలు సునీత, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామిడి శ్రావణ్ ప్రసాద్ రెడ్డి, మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు