తండ్రి క్యాన్సర్ చికిత్స కోసం సీజ్ చేసిన బంగారాన్నే తాకట్టు పెట్టిన కానిస్టేబుల్! Cancer Treatment
- సీజ్ చేసిన ఫోన్ నుంచి రూ.1.70 లక్షలు బదిలీ..
- బంగారం తాకట్టు పెట్టి రూ.12.37 లక్షలు తీసుకున్నట్లు గుర్తింపు
హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్): తండ్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స కోసం ఓ కానిస్టేబుల్ ఏకంగా పోలీస్‌స్టేషన్‌లో కేసుల దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన బంగారం, మొబైల్ ఫోన్లనే దుర్వినియోగం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రవణ్ ఈ అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
వివరాల ప్రకారం.. ఒక కేసులో పోలీసులు సీజ్ చేసిన మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి రూ.1.70 లక్షలను అక్రమంగా బదిలీ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో కేసులో సీజ్ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.12.37 లక్షలు రుణంగా తీసుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
తన తండ్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స ఖర్చుల కోసమే ఈ డబ్బులు తీసుకున్నానని శ్రవణ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే, ఇటీవలే ఆయన తండ్రి మరణించినట్లు తెలుస్తోంది.
ఈ అక్రమాలు వెలుగులోకి రావడంతో పోలీసులు శ్రవణ్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల స్వాధీనంలో ఉండాల్సిన సీజ్ చేసిన వస్తువుల దుర్వినియోగం ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.