BREAKING
దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి
www.ntodaynews.com

దారుణం.. 30 సెకండ్లలో 27 సార్లు కత్తితో పొడిచి ఉపాధ్యాయురాలి హత్య

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 06:16 AM
54 వీక్షణలు

హరియాణా: ఫరీదాబాద్ జిల్లాలోని సిక్రోనా గ్రామంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 29 ఏళ్ల యువ ఉపాధ్యాయురాలు సంధ్యను ఓ యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే దాదాపు 27 సార్లు కత్తితో పొడిచిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మొత్తం పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరీదాబాద్‌లోని సరస్వతి సీనియర్ సెకండరీ పాఠశాలలో సంధ్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. సోమవారం ఉదయం ఎప్పటిలాగే విధులకు హాజరైన ఆమెను కలవాలని చెప్పుతూ అమిత్ (21) అనే యువకుడు పాఠశాల గేటు వద్దకు వచ్చాడు. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సంధ్య బయటకు వెళ్లింది. అప్పటికే ముఖానికి ముసుగు ధరించి కాచుకుని ఉన్న అమిత్ ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగాడు.

సీసీటీవీ దృశ్యాల ప్రకారం, ముందుగా ఆమెను బలవంతంగా పట్టుకుని నేలకూల్చిన నిందితుడు, అనంతరం ముఖం, మెడ, ఛాతి, పొట్ట భాగాలను లక్ష్యంగా చేసుకుని అత్యంత కిరాతకంగా వరుసగా కత్తితో పొడిచాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, కేవలం అర నిమిషంలోనే సుమారు 27 సార్లు దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో సంధ్య అక్కడికక్కడే కుప్పకూలింది.

బాధితురాలి కేకలు విని పాఠశాల నిర్వాహకుడు తేజ్‌పాల్ అక్కడికి చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, నిందితుడు అతడిపైనా కత్తితో దాడి చేయడానికి యత్నించాడు. దీంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అనంతరం సంధ్యపై మరోసారి విచక్షణారహితంగా దాడి చేసిన అమిత్ బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి, ఘటన జరిగిన రెండు గంటల్లోనే అమిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమిత్‌కు సంధ్యతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అయితే ఆమె అతనితో మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. అయినప్పటికీ అమిత్ తరచూ ఆమెను వెంటాడుతూ వేధించేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో ఇటీవల సంధ్య పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదైన తర్వాత అమిత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో, అతడికి మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సంధ్య ఫిర్యాదును ఉపసంహరించుకుంది.

అయితే అదే విషయాన్ని మనసులో పెట్టుకున్న అమిత్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముందుగానే కత్తి తీసుకుని పాఠశాలకు చేరుకున్న అతడు, సంధ్య బయటకు వచ్చిన వెంటనే దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడైంది.

ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.