ఎర్రబెల్లి ప్రదీప్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. ప్రజాస్వామ్య హక్కులను హరించడం సరికాదని ఆగ్రహం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు పిలుపునిచ్చిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్లకుండా డబ్ల్యూజీఎల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రదీప్‌రావు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం విద్యార్థులు, వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రదీప్‌రావు డిమాండ్ చేశారు.