BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 08 June 2026, 10:32 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

డీఈఓ ను సస్పెండ్ చేయాలి.

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
08 Jun, 2026 - 10:32 PM
103 వీక్షణలు

డీఈఓ ను సస్పెండ్ చేయాలి.

విద్యార్థి,యువజన, ప్రజా సంఘాల నాయకులు.

నరసరావుపేట విద్యాశాఖాధికారి కార్యాలయంలో( సమగ్ర శిక్ష) ఖాళీగా ఉన్న జిసిడిఓ, ఏఎల్ఎస్ సిఓ , పోస్టులు డిప్యూటేషన్ పై భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. సదరు పోస్టులకు సంబందించి మెరిట్ లిస్టులు మే1వ తేదీన సిద్ధమైనప్పటికీ డిఇఓ  నిబందనలకు విరుద్ధంగా కొంతమంది ఒత్తిడితో అర్హత లేని అభ్యర్ధులకు అదనపు మార్కులు కలపాలనే ఉద్దేశ్యంతో మెరిట్ లిస్టులను కలెక్టర్ కార్యాలయానికి పంపకుండా ఆపేశారు. 10 రోజుల జాప్యం తరువాత డిఇఓ తను నిర్ణయించుకున్న అభ్యర్ధులకు అర్హత లేకున్నా... కమిటీపై ఒత్తిడి తెచ్చి అదనపు మార్కులు కలపడం జరిగిందని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ విద్యార్థి, యువజన ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. డిఆర్పి( డిస్టిక్ రిసోర్స్ పర్సన్) ట్రైనింగ్ ఇచ్చిన అభ్యర్ధులకు మాత్రమే అదనపు మార్కులు కలపాలి. కానీ డిఇఓ

 తను ఎంచుకున్న అభ్యర్థులకు  ట్రైనింగ్ ఇచ్చినట్టు సర్టిఫికెట్ లేకున్నా.. టైనింగ్ తీసుకున్నారు అనే నెపంతో అదనపు మార్కులను కలిపి లిస్టులను కలెక్టర్ కార్యాలయానికి పంపారు. అదనపు మార్కులు కలిపినప్పటికీ ఆ అభ్యర్ధులు మెరిట్ లిస్టులో వెనకబడే ఉండడంతో మెరిట్ లిస్టులో మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థులకు కాకుండా రెండవ స్థానంలో ఉన్న అభ్యర్ధులకు ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వేసి పోస్టులు భర్తీ చేయాలని దురాలోచనతో డిఇఓ

 వ్యవహరించారని,15 మార్కుల ఇంటర్వ్యూలో కలెక్టర్ తో పాటు 

డీఇఓ, ఏపీసీ, డైట్ కళాశాల ప్రధానోపాధ్యాయులు సభ్యులుగా ఉండాలి. అయితే డిఇఓ... డైట్ కళాశాల ప్రధానోపాధ్యాయులు కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కావున డిఇఓ  ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ జరిగితే పారదర్శకంగా జరిగే అవకాశం లేదు. కనుక నిబందనలను ఉల్లంఘించిన డిఈఓపై చర్యలు తీసుకుని ఇంటర్వ్యూ కలెక్టర్  ఆధ్వర్యంలో జరిగేటట్లుగా చూసి మెరిట్ ఉన్న వారికి  న్యాయం చేయలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి,యువజన, ప్రజా సంఘాల నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు, నల్లపాటి రామారావు ఆంజనేయ రాజు, గోదా జాన్ పాల్ కోట సాయి, మహంకాళి సుబ్బారావు మేకపోతుల నాగేశ్వరరావు బి. శ్రీను నాయక్, బి.రాంబాబు నాయక్, తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.