BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 July 2026, 06:16 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో ఘనంగా బీసీవై పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
23 Jul, 2026 - 06:16 PM
64 వీక్షణలు

పుంగనూరులో ఘనంగా బీసీవై పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

పుంగనూరు, జూలై 23: భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై పార్టీ) 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పుంగనూరు పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ  ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీ సేవా భావాన్ని చాటిచెప్పారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారు  *"నిన్నటి కల... నేటి ఉద్యమం... రేపటి భరోసా..*!" అనే సందేశాన్ని ప్రతి కార్యకర్త ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమని, బీసీల ఆత్మగౌరవ పరిరక్షణ, యువతకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడం, సామాజిక న్యాయం సాధించడమే బీసీవై పార్టీ ఆశయమని పేర్కొన్నారు.

మూడేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ బీసీవై పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో పార్టీ మరింత బలోపేతమై 2029లో ప్రజా ఆశయాల సాధన దిశగా విజయపథంలో ముందుకు సాగుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.