BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 23 July 2026, 05:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డా. వి. రవీంద్ర

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jul, 2026 - 05:45 PM
96 వీక్షణలు

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డా. వి. రవీంద్ర

తిరువూరు, జూలై 23: వర్షాకాలం, శీతాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు వీటి పట్ల అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు డా. వి. రవీంద్ర సూచించారు.

జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల నివారణపై రూపొందించిన కరపత్రాలను గురువారం తిరువూరులోని జ్యోతి నర్సింగ్ హోంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.

జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. గంగాధర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణపై జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. హరికృష్ణ, జిల్లా కార్యదర్శి ఎం. రాంప్రదీప్, తిరువూరు మండల అధ్యక్షుడు పి. శీనయ్య, ఏ. కొండూరు మండల గౌరవాధ్యక్షుడు పి. శోభన్ బాబు, గంపలగూడెం ప్రధాన కార్యదర్శి బి. సైదులు, నాయకులు ఎస్.డి. సుభాని, పి.వి. శరత్ బాబు, పి. రామకృష్ణ, కె. వెంకటేశ్వరరావు, నాగ శిరోమణి, అలీ బాబా తదితరులు పాల్గొన్నారు.