BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 03 August 2026, 09:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దసరా ఏర్పాట్లపై దుర్గగుడిలో పోలీస్ కమిషనర్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 09:03 PM
54 వీక్షణలు

దసరా ఏర్పాట్లపై దుర్గగుడిలో పోలీస్ కమిషనర్ సమీక్ష

విజయవాడలో జరిగే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు అధికారులను ఆదేశించారు.

దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ఆలయ అధికారులతో కలిసి ఇంద్రకీలాద్రిపై ఆలయం, పరిసర ప్రాంతాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ అనంతరం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ స్థలాలు, హోల్డింగ్ ఏరియాలు, బ్యారికేడ్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్ పరిసరాలు, కృష్ణానది స్నాన ఘాట్లు, క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సమీక్షలో పశ్చిమ డీసీపీ జి. రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, ఇన్‌స్పెక్టర్లు గుణరాం, ఉమా మహేశ్వరరావు, దేవస్థాన అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.