BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 23 February 2026, 10:14 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

టైర్ల కంపెనీ మూసివేయాలని డిమాండ్

తెలంగాణ
23 Feb, 2026 - 10:14 PM
393 వీక్షణలు
టైర్ల కంపెనీ మూసివేయాలని రంగాపూర్ గ్రామస్తుల డిమాండ్ NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపురం గ్రామానికి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న టైర్ల కంపెనీని తక్షణమే మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మెరుపు చెరువు కట్ట వెనుక భాగంలో ఎన్ అండ్ ఎన్ పేరుతో నిర్వహిస్తున్న టైర్ల కంపెనీ నుంచి అధికంగా పొగ, కాలుష్యం వెలువడుతోందని గ్రామస్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామస్థులు మాట్లాడుతూ, వందలాది టైర్లు కాల్చడం వల్ల వచ్చే దుర్వాసనతో తరచూ జలుబు, అలర్జీ వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అనుమతులు లేకుండా చిన్న స్థాయిలో ప్రారంభించిన యూనిట్‌ను విస్తరించడం వల్ల కాలుష్యం మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పైరాలసిస్ పరిశ్రమలకు అనుమతులు ఎలా ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాలని కోరారు. కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని, జీవించే హక్కును హరిస్తున్న ఈ యూనిట్‌పై తక్షణ చర్యలు తీసుకుని మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మైలారం జంగయ్య, వార్డు సభ్యులు ఠాకూర్ రాజేందర్ సింగ్, ప్రవీణ్, లక్ష్మారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. #Bommalaramaram #YadadriBhuvanagiri #PollutionIssue #PublicHealth #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube