BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

జిల్లాలోని స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

తెలంగాణ
28 Apr, 2025 - 09:02 AM
351 వీక్షణలు
ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసంలో వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలి. జిల్లాలోని స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ మే 12, 13 తేదీలలో కలెక్టర్ కార్యాలయం ముందు 48 గంటల దీక్ష మే 14వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. స్థానిక భువనగిరి వినాయక చౌరస్తా వద్ద డిమాండ్ కరపత్రం విడుదల ఈ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు స్వరూపంగా ప్రకాష్ వనం ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసంలో పథకలలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్వరూపంగా ప్రకాష్ వనం ఉపేందర్ డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇంటి నిర్మాణం కోసం 5లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి, స్వంత ఇళ్ళు లేని నిరుపేదలకు ఆవాసం కల్పించెందుకు 2025 జనవరి 26 న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పథకం ప్రారంభం సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇండ్లలో వికలాంగులకె మొదటి ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు.ముఖ్యమంత్రి గారి ప్రకటన స్వంత ఇళ్ళు లేని నిరుపేద వికలాంగులో చిరునవ్వు చిందించింది. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడుతలో 71,482 ఇండ్లు మంజూరు చేసింద.ప్రతి నియోజకవర్గనికి 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది.2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాల్లో వికలాంగుకు 5శాతం రిజర్వేషన్స్ అమలు చేయడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే సాధారణ లబ్ధిలో 25 శాతం ఇవ్వాలి. కానీ ఇందిరమ్మ ఇండ్లలో 2016 ఆర్పిడి చట్టం కు భిన్నంగా అధికారులు వ్యవహారిస్తున్నారు. అధికారుల వైఖరి మూలంగా ఇందిరమ్మ ఇండ్లలో వికలాంగుకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. జీవో 1 ప్రకారం, గృహ నిర్మాణ శాఖ విడుదల చేసిన మెమో నెం 1836/ఆర్ హెచ్ &సి ఏ1/2017 మరియు జీవో 33ట్రాన్స్పోర్ట్ రోడ్ మరియు బిల్డింగ్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లలో 5 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాల్సి ఉంది. కానీ మండల స్థాయిలో ఎంపిడివో లు లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు చేయాలని కోరితే ప్రత్యేకంగా వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లలో 5శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని చెప్పుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తుంటే మండల స్థాయిలో దీనికి భిన్నంగా ఉంది.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఇండ్లలో వికలాంగులకు 5శాతం రిజర్వేషన్స్ అమలు చేయడంతో పాటు ఇంటి నిర్మాణ వ్యయంలో వికలాంగులకు 25 శాతం అదనంద ఇచ్చే విదంగా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రాష్ట్రాంలో 5లక్షల మందికి 6000 కోట్లతో రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని,ఇందులో వికలాంగులకు 5శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు.రాజీవ్ యువ వికాసంలో 25,000 మందికి రుణాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో దరఖాస్తు చేసుకున్న ప్రతి వికలాంగులకు ఎలాంటి షరతులు లేకుండా రుణం మంజూరు చేసే విధంగా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. జిల్లాలో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారం కొరకు మే నెల 12, 13 తేదీలలో 48 గంటలు కలెక్టర్ కార్యాలయం ముందు దీక్షలు చేపడతామని మే 14వ తేదీన వందలాదిమంది వికలాంగులతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి కోశాధికారి కొత్త లలిత భువనగిరి మండల అధ్యక్షులు కేతావత్ మురళి నాయక్ నాయకులు పాండల శ్రీహరి రత్నపురం యాదగిరి శ్రీశైలం తదితరులు పాల్గొనడం జరిగింది. Follow us on Website Facebook Instagram YouTube