BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 05 March 2026, 09:15 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గొర్రెల కాపరులను ఆదుకోవాలని డిమాండ్

తెలంగాణ
05 Mar, 2026 - 09:15 AM
404 వీక్షణలు
తొక్కిసలాటలో 80 గొర్రెల మృతి.. గొర్రెల కాపరులను ఆదుకోవాలని డిమాండ్ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున బనగానపల్లె మండలం నందవరం గ్రామంలోని ఏస్‌ఆర్‌బీసీ కాలువ సమీపంలో జరిగిన ఘటనలో సుమారు 80 గొర్రెలు తొక్కిసలాటలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. నీరు తాగేందుకు వెళ్లిన సమయంలో గొర్రెలు ఒక్కదాని మీద ఒకటి పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బేతంచర్ల మండలం బుగ్గాన్నిపల్లె గ్రామానికి చెందిన బక్క నాగేష్, పర్లపాటి శేఖర్, మల్లికార్జున, ఆంజనేయులు మరియు ఇతర గొర్రెల కాపరుల గొర్రెలు ఈ ఘటనలో మృతి చెందాయి. జీవనోపాధి కోసం ఇతర గ్రామాలకు వచ్చి గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్న ఈ రైతులకు ఇది భారీ నష్టం కలిగించింది. ఈ ఘటనపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన గొర్రెలను ఒక విపత్తుగా గుర్తించి జిల్లా కలెక్టర్ వెంటనే బాధిత గొర్రెల కాపరులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించి వారికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే స్థానిక అధికారులు బాధితులను కలుసుకుని వారికి మనోధైర్యం కల్పించాలని సూచించారు. ఘటన అనంతరం గొర్రెల కాపరులతో ఫోన్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పినట్లు శివకృష్ణ యాదవ్ తెలిపారు. #Banaganapalle #Nandavaram #ShepherdsLoss #LivestockLoss #ShivakrishnaYadav #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube