BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 17 February 2026, 11:10 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి

తెలంగాణ
17 Feb, 2026 - 11:10 AM
176 వీక్షణలు
అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివిధ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో మంజూరైన పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో, ఎంత మేర నిధులు ఖర్చయ్యాయో, ఎక్కడెక్కడ సదుపాయాల పునరుద్ధరణ జరిగిందో అధికారులను ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో నిర్మాణంలో ఉన్న ‘శక్తి భవన్’ పనులను వేగవంతం చేసి మహిళా దినోత్సవం నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందో వివరణ కోరిన కలెక్టర్, కాంట్రాక్టర్లతో ఒప్పందాలు ఉన్నప్పటికీ ఆలస్యం అస్సలు సహించబోమని హెచ్చరించారు. ప్రజల సౌకర్యాల విషయంలో రాజీపడకూడదని, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులను విభాగాల వారీగా సమన్వయంతో చేపట్టి, గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన పురోగతి కనిపించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. #YadadriBhuvanagiri #DistrictReview #DevelopmentWorks #PublicInfrastructure #TelanganaNews #Governance Follow us on Website Facebook Instagram YouTube