BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

​ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగంగా నిర్వహించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 May, 2026 - 07:23 PM
219 వీక్షణలు

​రైస్ మిల్లులు, గోదాములకు త్వరితగతిన ధాన్యం తరలింపు

జూన్ 7 నుండి వర్షాలు వచ్చే అవకాశం.. ఆలోపే కొనుగోళ్లు పూర్తి చేస్తాం: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రభుత్వం చేపట్టిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులు, గోదాములకు తరలించడం జరుగుతుందని, ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. 

​గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ ప్రాంతంలో గల మునీందర్ & బ్రోస్ ఫర్టిలైజర్స్ గోదాంను ఆయన అధికారులతో కలిసి సందర్శించి, ధాన్యం దిగుమతి ప్రక్రియను పరిశీలించారు.

​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాకు చెందిన ధాన్యం నిల్వ చేసేందుకు ఈ గోదామును కేటాయించడం జరిగిందని తెలిపారు. ధాన్యం దిగుమతి వేగంగా నిర్వహించాలని, లారీల అన్‌లోడింగ్‌కు ఇబ్బంది లేకుండా అవసరమైన మేరకు హమాలి సంఖ్యను పెంపొందించుకోవాలని అధికారులను సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఎలాంటి నష్టం కలుగకుండా ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 

​వచ్చే నెల (జూన్) 7వ తేదీ నుండి వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున, ఈలోగానే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు