BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 02 July 2025, 10:25 am
Posted by : NTODAY NEWS OFFICIAL

లబ్ధిదారులకు ఉచితంగా కంకర ఇవ్వాలని సూచన చేసిన జిల్లా అధికారి

తెలంగాణ
02 Jul, 2025 - 10:25 AM
282 వీక్షణలు
43 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కంకర,డస్ట్ ఉచితంగా సరఫరా చేస్తానని ముందుకు వచ్చిన మాధవరావు క్రషర్ ను ఆదర్శంగా తీసుకోవాలి : జిల్లా పంచాయతీ అధికారి సునంద NTODAY NEWS: బొమ్మలరామారం. ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం మంజూరు చేసిన లబ్ధిదారులకు క్రషర్ యజమానులు ఉచితంగా కంకర ఇవ్వాలని మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ జ్యోతి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా పంచాయతీ అధికారి సునంద హాజరై మాట్లాడుతూ బొమ్మలరామారం, మైసిరెడ్డిపల్లి గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల పథకాలలో భాగంగా 43 మందికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా మండల కేంద్రంలో ఉన్న మాధవరావు ఐ పవర్ యజమాని టి.మాధవరావు ఉచితంగా కంకర, డస్ట్ ఇస్తానడం హర్షించదగ్గ విషయమని ఆమె అన్నారు. అలాగే ఇందిరమ్మ లబ్ధిదారులకు మండలంలోని 35 గ్రామ పంచాయతీల లబ్ధిదారులకు ఉచితంగా కంకర ఇవ్వాలని సూచన చేశారు జిల్లా అధికారి సూచన మేరకు మండలంలో ఉన్న మిగతా క్రషర్ యజమానులు అందరం మాట్లాడుకుని రేపు తమ నిర్ణయం వెల్లడిస్తామని అధికారులకు తెలిపారు అలాగే లబ్ధిదారులకు కట్టుకోవడానికి ఇసుక ప్రభుత్వమే ఇస్తుందని మండల తాహాసిల్దార్ పి.శ్రీనివాసరావు తెలియజేశారని తెలిపారు సిమెంట్, ఐరన్ రాడ్లకు సంబంధించిన డీలర్లు తక్కువ ధరలో వారికి ఇవ్వాలని సూచన చేశారు అలా చేయడం ద్వారా లబ్ధిదారునికి సుమారుగా 50 వేల నుండి 60 వేల వరకు లబ్ధి పొందవచ్చునని ఆమె అన్నారు. ప్రభుత్వానికి లబ్ధిదారులకు ఎంతగానో సహాయం చేసినట్టు అవుతుందని వారు తెలిపారు గ్రామ పంచాయతీ కార్యదర్శి క్రషర్ యజమానులకు సిమెంటు డీలర్లకు ఐరన్ రాడ్లు డీలర్లకు అనుసంధానంగా ఉండి లబ్ధిదారులకు అందించే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జ్యోతి కుమార్,ఎమ్మార్వో శ్రీనివాస్ రావు, ఎంపీడీవో రాజా త్రివిక్రమ్, ఎస్సై బుగ్గ శ్రీశైలం, ఎంపి ఓ శ్రీమాలిని, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, క్రషర్ యజమానులు, స్టీల్ ఐరన్ దుకాణదారులు, ఇటుక బట్టీల యజమానులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube