BREAKING
thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్
Date of Publish : 07 March 2026, 10:19 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దు

తెలంగాణ
07 Mar, 2026 - 10:19 PM
228 వీక్షణలు
అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దు: భువనగిరి ఆర్డీవో NTODAY NEWS: భువనగిరి నిషేధిత భూములు మరియు నిషేధిత జాబితాలో ఉన్న ఇండ్ల (నాల భూములు) గురించి సోషల్ మీడియా మరియు వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని భువనగిరి ఆర్డీవో స్పష్టం చేశారు. ఆర్డీవో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజిస్ట్రేషన్ యాక్ట్–1908 సెక్షన్ 22-A ప్రకారం నిషేధిత భూముల జాబితా ఇప్పటికే ప్రకటించబడింది. ఈ జాబితాలో ప్రభుత్వ భూములు, చెరువులు, శికం భూములు, దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ భూములు, భూదాన్ భూములు, సీలింగ్ భూములు మరియు వివిధ ప్రభుత్వ అవసరాల కోసం భూసేకరణ చేసిన భూములు ఉన్నాయి. అలాగే రోడ్లు, రైల్వేలు, నీటి పారుదల ప్రాజెక్టులు, కాలువలు, వీకర్ సెక్షన్ ఇళ్ల స్థలాలు, 2BHK ఇళ్ల కోసం సేకరించిన భూములు మరియు స్వాతంత్ర్యం తర్వాత భూమిలేని పేదలకు కేటాయించిన లావుని పట్టా భూములు కూడా ఈ నిషేధిత జాబితాలో ఉంటాయని తెలిపారు. ఈ భూములను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం చట్టపరంగా నిషేధించబడిందని, అవి కేవలం సంబంధిత వారసులకు మాత్రమే చెందుతాయని ఆర్డీవో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ భూములు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితాలో ఉన్నప్పటికీ, కొందరు దురుద్దేశపూర్వకంగా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అటువంటి అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హెచ్చరించారు. #Bhuvanagiri #RDO #LandRules #TelanganaNews #PublicNotice #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube