BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 24 February 2026, 08:03 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఉద్యోగాల పేరుతో మోసాలకు గురికావద్దు

తెలంగాణ
24 Feb, 2026 - 08:03 AM
329 వీక్షణలు
ఉద్యోగాల పేరుతో మోసాలకు గురికావద్దు: కర్నూలు ఎస్పీ హెచ్చరిక NTODAY NEWS: కర్నూలు జిల్లా కర్నూలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు మధ్యవర్తుల ద్వారా రావని, కేవలం పోటీ పరీక్షలు మరియు ప్రతిభ ఆధారంగానే లభిస్తాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన నిరుద్యోగుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, కోర్టులు, స్టాఫ్ నర్స్, ఫీల్డ్ అసిస్టెంట్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, బ్యాంకులు, హోంగార్డ్స్, ఫుడ్ కార్పొరేషన్, విద్యుత్, వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, క్లర్క్ వంటి పలు ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడం పూర్తిగా మోసపూరితమని స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంలో కూడా అర్హతలు, నైపుణ్యాలు మరియు ఎంపిక విధానాల ప్రకారమే నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎస్పీ సూచనలు: ఉద్యోగాల పేరుతో ఎవరికి కూడా డబ్బులు చెల్లించవద్దు. అధికారిక నోటిఫికేషన్లు మాత్రమే నమ్మాలి. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. నిరుద్యోగ యువత తమ ప్రతిభపై నమ్మకం ఉంచుకుని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. ఉద్యోగాల పేరుతో మోసగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మోసాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. #Kurnool #JobFraudAlert #AndhraPradeshPolice #YouthAwareness #APPolice Follow us on Website Facebook Instagram YouTube