BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 11 August 2026, 08:47 am
Posted by : NTODAY NEWS

DSC 2025, నిరుద్యోగ సమస్యలపై ఆత్మకూరులో ర్యాలీ, రాస్తారోకో

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
11 Aug, 2026 - 08:47 AM
81 వీక్షణలు

శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ ఆందోళన

ఆత్మకూరు: NTODAY NEWS 

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు DSC–2025, నిరుద్యోగం తదితర సమస్యలపై ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు.

ఆత్మకూరు పట్టణంలోని వైఎస్సార్ కూడలి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. DSC–2025 విషయంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలని, యువత సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ శిల్ప భువనేశ్వర్ రెడ్డి, వెలుగోడు ఎంపీపీ శ్రీ లాలం రమేష్ గుప్తా, మోత్కూరు మాజీ ఎంపీటీసీ ఎం. రామ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అలాగే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ, రాస్తారోకోను విజయవంతం చేశారు. నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.