BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

ఈదర గ్రామంలో వంట ఏజెన్సీ కార్మికురాలు మృతికి ఆర్థిక సహాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Apr, 2026 - 09:28 PM
224 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామం హెచ్ డబ్ల్యూ పాఠశాల వంట ఏజెన్సీ ఉద్యోగిగా పనిచేస్తున్న దొండపాటి నిర్మల గారు 29 మార్చ్ 2026 తేదీన ఉదయం హార్ట్ అటాక్ కారణంగా మరణించారు. ఆమె మరణం వలన గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మిడ్డే మీల్, శానిటేషన్ వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రూ.5000/- ఆర్థిక సహాయం ఆమె చిన్న కోడలు రత్నకుమారి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో, మిడ్డే మీల్ మండల అధ్యక్షురాలు కలపాల రాణి, ఏఐసీసీ టు యు జిల్లా కమిటీ సభ్యులు పల్లెపాము భవాని, జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వేముల బక్కయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో 23 సంవత్సరాలు పైగా విధులు నిర్వహిస్తున్న వంట ఏజెన్సీ కార్మికులకు కనీస వేతనాలు పెంచకపోవడం, సుమారు రూ.3000/- వేతనంతో పని చేయించుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. అలాగే, లేబర్ కమిషన్ పర్యవేక్షణ లేకపోవడం వల్ల చట్టాలు అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కార్మికుల హక్కుల కోసం వారు అడిగిన ప్రధాన డిమాండ్లు:12 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానం అమలు చేయాలని.సమాన పనికి సమాన వేతనం: రూ.36,000/- జీతం.పెన్షన్: రూ.10,000/-.కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలనే అభ్యర్థన.రాజకీయ వేధింపులు, నియామకాల్లో కక్ష సాధింపులు తొలగించాలని.దహన సంస్కరణలకు రూ.20,000/- సాయం.ఆరోగ్య భీమా, ఉద్యోగ భీమా సౌకర్యాలు కల్పించాలని.వంట సామాగ్రి, గ్యాస్ ఉచితంగా ఇవ్వాలని.2 వేతనాలతో సెలవులు, 25/- రూపాయల_మెను చార్జీలు, రెండు జతలు యూనిఫాం ఇవ్వాలని.ఈ కార్యక్రమంలో వేముల బక్కయ్య, కలపాల రాణి, పల్లెపాము భవాని మరియు పలువురు కార్మికులు పాల్గొన్నారు.