BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 22 June 2026, 03:24 pm
Posted by : V శ్రీనివాస్

​ఎంసీసీని పరిరక్షించి, పునరుద్ధరించాలి: హెచ్‌ఎంఎస్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 Jun, 2026 - 03:24 PM
273 వీక్షణలు

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ఒకప్పుడు వేలాది మందికి ఉపాధి కల్పించిన మంచిర్యాల సిమెంట్ కంపెనీ (ఎంసీసీ)ని పరిరక్షించి, రాష్ట్ర ప్రభుత్వం లేదా సింగరేణి సంస్థ ద్వారా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ హింద్ మజ్దూర్ సభ (HMS) జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంసీసీ కోసం కేటాయించిన సుమారు 438 ఎకరాల పారిశ్రామిక భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాలు కాకుండా కాపాడాలని కోరారు. అలాగే మూతపడిన కంపెనీపై ఆధారపడిన కార్మికులకు చెల్లించాల్సిన జీతాలు, పీఎఫ్, గ్రాట్యుటీ తదితర చట్టబద్ధ బకాయిలను తక్షణమే ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

​రామగుండం ఎరువుల కర్మాగారం, కాగజ్‌నగర్ పేపర్ మిల్లులను ప్రభుత్వం చొరవతో పునరుద్ధరించిన తరహాలోనే, ఎంసీసీని కూడా తెరిపించి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి ప్రత్యేక లేఖ ద్వారా తీసుకెళ్లాలని, ప్లాంట్ భవిష్యత్తుపై ప్రజా, కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ ఉపాధ్యక్షులు ఎం.డి. షఫీ, జిల్లా కార్యదర్శి తగరం శ్రీనివాస్, నాయకులు ఎం.డి. ఉస్సెన్, దున్నపోతుల రమేష్, పల్లపు శ్రీనివాస్, చల్ల మోహన్, చిప్పకుర్తి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు