BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

​పల్స్ పోలియో, సీజనల్ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 Jun, 2026 - 04:22 PM
99 వీక్షణలు

మంచిర్యాల: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ (ఐఏఎస్) గారి ఆధ్వర్యంలో పల్స్ పోలియో మరియు సీజనల్ వ్యాధుల నివారణపై జిల్లా టాస్క్ ఫోర్స్ సమీక్షా సమావేశం జరిగింది. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీరాములు, డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ లతో కలిసి ఆయన ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 28వ తేదీన 459 కేంద్రాల ద్వారా ఐదేళ్లలోపు 76,365 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పట్టణ ప్రాంతాల్లో 86, గ్రామీణంలో 353, గిరిజన ప్రాంతాల్లో 20 కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో 24 ట్రాన్సిట్, 24 మొబైల్ టీమ్ లను ఏర్పాటు చేశామన్నారు. సుమారు 1,836 మంది వైద్య, ఆశ, అంగన్వాడీ సిబ్బంది ఈ విధుల్లో పాల్గొంటారని, 28న పోలియో కేంద్రాల్లో, 29 మరియు 30 తేదీల్లో ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. పంచాయతీరాజ్, మున్సిపల్, ఐసీడీఎస్ తదితర అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

​వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రబలే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి కీటక జనిత వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర అన్ని శాఖలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. దోమల నియంత్రణలో అందరినీ భాగస్వాములను చేయాలని, అన్ని గ్రామాల్లో ఓఆర్ఎస్ (ORS) ద్రావణాలు, మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. తక్షణ చర్యల నిమిత్తం వ్యాధుల కట్టడికి జిల్లా, మండల స్థాయిల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీం (RRT)లను ఏర్పాటు చేయాలన్నారు. డెంగ్యూ కేసుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, డెంగ్యూ పేరుతో ప్రజలను భయాందోళనలకు గురిచేయవద్దని ప్రైవేట్ ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. అనంతరం పల్స్ పోలియోకు సంబంధించిన ప్రచార పోస్టర్లను, వ్యాధుల నివారణపై అవగాహన బ్యానర్లను కలెక్టర్ లాంఛనంగా విడుదల చేశారు.

​ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది విస్తృతంగా పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ), జిల్లా డిప్యూటీ కలెక్టర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, డీపీహెచ్ఎన్ ఆర్.ఎస్ పద్మ, నాందేవ్, శ్రీనివాస్, రవి కిరణ్ లతో పాటు ఇతర వైద్యాధికారులు, మలేరియా నిర్మూలన విభాగం వైద్య సిబ్బంది పాల్గొన్నారు