BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 22 June 2026, 04:23 pm
Posted by : V శ్రీనివాస్

సివిల్ సప్లై కార్మికుల వేతనాలు ఒకేసారి చెల్లించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 Jun, 2026 - 04:23 PM
178 వీక్షణలు

బడ్జెట్ సాకుతో విడతల వారీగా ఇవ్వడం అన్యాయం: ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల దాసు

​మంచిర్యాల :సివిల్ సప్లై (పౌర సరఫరాల) శాఖలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు సక్రమంగా చెల్లించాలని ఏఐటీయూసీ (AITUC) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మేకల దాసు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన సివిల్ సప్లై కార్మికులతో కలిసి అధికారులకు వినతిపత్రం అందజేశారు.

​ఈ సందర్భంగా మేకల దాసు మాట్లాడుతూ.. కార్మికులకు నెలకు రెండుసార్లు కాకుండా ఒకేసారి పూర్తి వేతనం చెల్లించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లేదనే సాకుతో కార్మికుల కష్టార్జితాన్ని విడతల వారీగా చెల్లించడం దారుణమన్నారు. ఇది కార్మికులకు తీవ్ర అన్యాయం చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి కార్మికుల వేతనాల చెల్లింపులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో కార్మికులందరినీ ఏకతాటిపైకి తెచ్చి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సివిల్ సప్లై కార్మికులు పాల్గొన్నారు