BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 22 June 2026, 04:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాల స్థలంలో ఆక్రమణలు తొలగించాలని వినతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 04:56 PM
111 వీక్షణలు

చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం: నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాల స్థలంలో ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని కోరుతూ ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్ జి. నాగరాజు మాట్లాడుతూ, గురుకుల పాఠశాలకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ ఆక్రమణల కారణంగా భవిష్యత్తులో పాఠశాల అవసరాలకు అదనపు భవనాలు నిర్మించేందుకు స్థలం కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు.

ఇప్పటికే పాఠశాల స్థలంలో కాలనీలు నిర్మించబడటంతో, ఆదివారాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వాహనాలు నిలిపేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పాఠశాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేసి, ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు.

వినతిపత్రం అందజేసిన వారిలో ఎస్‌ఎంసీ కమిటీ వైస్‌చైర్మన్ డి. లలిత, సభ్యులు వి. లావణ్య, ఎం. నాగరాణి తదితరులు పాల్గొన్నారు.