BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 26 June 2026, 06:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్నికల్లో రూ.100 కోట్ల వరకు ఖర్చు.. అవినీతి పెరుగుతోంది: గుత్తా

తెలంగాణ
/ నల్గొండ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:46 PM
101 వీక్షణలు

నల్గొండ: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అవినీతి, ఎన్నికల ఖర్చులు, రాజకీయ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్న పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారుల్లో అవినీతి ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు తిరిగి పోస్టింగులు ఇవ్వకూడదని సూచించారు. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కార్యకర్తలే ప్రజాప్రతినిధులయ్యేవారని, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లే రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిన్న స్థాయి ఉద్యోగుల వద్ద కూడా కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. సేద్యయోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలను నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు.