BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 11 March 2026, 07:50 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఉత్సాహంగా ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక

తెలంగాణ
11 Mar, 2026 - 07:50 AM
523 వీక్షణలు
చిట్యాలలో ఉత్సాహంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ వార్డుల్లో పారిశుధ్య పనులు చేపట్టిన మున్సిపల్ పాలకవర్గం NTODAY NEWS : చిట్యాల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా బుధవారం చిట్యాల పురపాలక సంఘం పరిధిలో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ ఆధ్వర్యంలో 2వ మరియు 9వ వార్డుల్లో పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్ల పక్కన పెరిగిన కంపచెట్లు, అడవి మొక్కలను మున్సిపల్ సిబ్బందితో తొలగింపజేశారు. అనంతరం దోమల నివారణ కోసం మరియు అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మురుగు కాలువలపై బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. అలాగే వార్డుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా మరియు ఆరోగ్యవంతంగా ఉంచడమే ఈ ప్రగతి ప్రణాళిక ముఖ్య లక్ష్యమని తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండబోయిన శ్రీలక్ష్మి సైదులు, వార్డు కౌన్సిలర్లు షబానా అజీమ్, ఏర్పుల పరమేష్, కుక్కల మోహన్, గాలి యాదమ్మ లింగయ్య, కోనేటి ఎల్లయ్య, నిమ్మనగోటి శ్రీనివాస్, నాగిళ్ల సుధాకర్, జెర్రిపోతుల సత్యనారాయణ, మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. #Chityal #PrajaPalana #SwachhTown #TelanganaDevelopment #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube