BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 14 June 2026, 06:28 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎస్సై డి రామకృష్ణ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jun, 2026 - 06:28 AM
151 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం స్థానిక చాట్రాయి గ్రామంలో ఎస్సై డి. రామకృష్ణ ఆధ్వర్యంలో రోడ్డు సేఫ్టీ, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ధారణ, ట్రాఫిక్ నిబంధనలు తదితర అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువత, వాహనదారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్సై డి. రామకృష్ణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, వేగ పరిమితిని పాటించకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వంటి కారణాలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తున్నాయని వివరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు తల గాయాల తీవ్రత తగ్గుతుందని, ఇది ప్రతి ఒక్కరి జీవన భద్రతకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలపై కూడా అవగాహన కల్పిస్తూ, మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని తెలిపారు.

ప్రమాదాల నివారణ కోసం గ్రామస్థులు, యువత కలిసి ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలని, పోలీస్ శాఖ ఎప్పుడూ ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో స్థానికులు కూడా ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.