BREAKING
thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
Date of Publish : 31 August 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గద్వాల మార్కెట్‌ యార్డులో భారీగా గంజాయి పట్టివేత

తెలంగాణ
/ జోగులాంబ గద్వాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 04:13 PM
66 వీక్షణలు

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సుమారు 6 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు, దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.6 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుండగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారు జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం శెనిగపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలుస్తోంది.

గంజాయి పట్టుబడిన ఘటనతో గద్వాల పట్టణంలో మత్తు పదార్థాల విక్రయాలు, సరఫరాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి వ్యాపారం జరుగుతోందా అనే అంశంపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

పట్టణంలోని అనుమానాస్పద ప్రాంతాలు, గంజాయి సరఫరా మార్గాలపై మరింత నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గంజాయి రహిత గద్వాల కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.