BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 04:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గద్వాలలో 21 ఏళ్ల తర్వాత న్యాయం కోసం తల్లి ధర్నా.. కొడుకు తండ్రిని అంగీకరించాలని డిమాండ్

తెలంగాణ
/ జోగులాంబ గద్వాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 04:14 PM
92 వీక్షణలు

గద్వాల జిల్లా: కొడుకు పుట్టిన 21 ఏళ్ల తర్వాత తన కుమారుడికి తండ్రి నువ్వేనంటూ ఓ మహిళ నిరసనకు దిగింది. తన కుమారుడిని వెంట పెట్టుకొని ధర్నా చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది.

గద్వాలకు చెందిన కృష్ణవేణి అనే మహిళ చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న ఓ కుటుంబంలో పనిచేసేదని తెలిపింది. వయసు వచ్చిన తర్వాత కూడా అదే ఇంట్లో పనిచేస్తుండగా, ఆ ఇంటి యజమాని కుమారుడు తనను లోబర్చుకొని గర్భవతిని చేశాడని ఆరోపించింది.

ఈ విషయం తెలిసిన తర్వాత గర్భస్రావం చేయించేందుకు ప్రయత్నించాడని, అయితే అది విఫలమైందని పేర్కొంది. అనంతరం జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి తనను అక్కడి నుంచి తీసుకెళ్లారని తెలిపింది.

ఆ తర్వాత తాను మగబిడ్డకు జన్మనిచ్చానని, గత 21 ఏళ్లుగా తన కుమారుడిని తన కొడుకుగా అంగీకరించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించింది. తనను బెదిరిస్తూ, దౌర్జన్యం చేస్తున్నారని, చేతబడి చేయించి చంపేస్తామని భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇప్పటికైనా తన కుమారుడికి తండ్రిగా అతడు అంగీకరించి న్యాయం చేయాలని కృష్ణవేణి డిమాండ్ చేసింది. ఈ ఘటనపై అధికారుల జోక్యం కోరింది.