BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 17 June 2026, 07:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గ్రామాల్లో స్వచ్ఛతపై ప్రత్యేక పరిశీలన – లింగపాలెం మండలంలో స్వచ్ఛపాదం కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 07:16 PM
126 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలోని అన్నపనేనివారిగూడెం గ్రామ పంచాయతీలో డిప్యూటీ ఎంపీడీవో స్వచ్ఛపాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పరిశుభ్రత పరిస్థితులు, సానిటేషన్ పనులు, తాగునీటి సరఫరా వ్యవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

తాగునీటి పన్నుల వసూలు, స్వచ్ఛత నిర్వహణ, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ (PGRS) ద్వారా వచ్చిన ఫిర్యాదులపై కూడా సమీక్ష చేపట్టారు. గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు.

గ్రామ పంచాయతీల పరిధిలో పరిశుభ్రతను మెరుగుపరచాలని, ప్రజలకు మెరుగైన తాగునీటి సేవలు అందేలా చర్యలు వేగవంతం చేయాలని డిప్యూటీ ఎంపీడీవో సూచించారు. స్వచ్ఛపాదం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అవగాహన పెంపొందించి, పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా మార్చాలని పేర్కొన్నారు.