BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 21 June 2026, 04:24 pm
Posted by : V శ్రీనివాస్

​గుడిపేట మెడికల్ కాలేజీని సందర్శించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
21 Jun, 2026 - 04:24 PM
249 వీక్షణలు

అధ్యాపకులు, విద్యార్థుల ఘన స్వాగతం

విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న వైనం

మంచిర్యాల నియోజకవర్గం, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేటలో నూతనంగా ప్రారంభమైన ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీకి విచ్చేసిన ఎమ్మెల్యేకు కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

​అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మెడికల్ కాలేజీ విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో వసతులు, ఇతరత్రా ఎదురవుతున్న ఇబ్బందులపై విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా చదువుపై దృష్టి సారించాలని, మీకు ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించడానికి 'నేనున్నానని' ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు భరోసా కల్పించారు.

​ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్లా సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు