BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 11 July 2026, 05:58 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుంటూరు పశ్చిమలో రేషన్ మాఫియాపై ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరోసారి ఉక్కుపాదం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:58 AM
85 వీక్షణలు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరోసారి కఠిన చర్యలు చేపట్టారు. రామనామ క్షేత్రం సమీపంలో రేషన్ షాప్ నంబర్–150 పరిధిలో అక్రమంగా తరలింపుకు సిద్ధం చేసిన 100కు పైగా రేషన్ బస్తాలను స్వయంగా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్న విషయం తెలుసుకున్న అక్రమార్కులు పరారవగా, వాహన డ్రైవర్ పోలీసులకు చిక్కాడు.

18వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఉల్లి గోపాల్ కృష్ణ ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఎమ్మెల్యే పరిస్థితిని పరిశీలించి వెంటనే లాలాపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రేషన్ బియ్యం లోడ్ చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి లాభాలు పొందే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు చేరాల్సిన బియ్యం దుర్వినియోగం కాకుండా అధికారులు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గతంలో కూడా నల్లచెరువు, నల్లకుంట ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణాను స్వయంగా అడ్డుకుని కేసులు నమోదు చేయించినట్లు గుర్తుచేశారు. అనంతరం పోలీసు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించడంతో పాటు ప్రతి రేషన్ దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ మాఫియాకు ఎలాంటి అవకాశం ఇవ్వబోమని, అక్రమ రవాణా, అక్రమ నిల్వలు, దుర్వినియోగంపై నిరంతర నిఘా కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.