BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 01 April 2026, 07:13 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

​ఘనంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు

తెలంగాణ
/ పెద్దపల్లి
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
01 Apr, 2026 - 07:13 PM
161 వీక్షణలు

గిరిజన విద్యార్థుల మధ్య మంత్రి జన్మదిన వేడుకలు 

ధర్మారం మినీ గురుకులంలో కేక్ కట్ చేసిన మంత్రి అడ్లూరి..

పాఠశాలను పదవ తరగతి ఆఫ్ గ్రేడ్ చేస్తానని హామీ..

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులు మరియు వయో వృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ తన జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మినీ గురుకుల పాఠశాలలో గిరిజన విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా మినీ గురుకుల పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు నూతన కిచెన్ షెడ్ ను ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యకు ప్రధాన ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ధర్మపురికి రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు మంజూరి చేసిందని మంత్రి అడ్లూరి తెలిపారు.


ధర్మారం మండలంలోని గురుకుల పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి వరకు తరగతులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. 


రాజకీయంగా తొలిసారి అవకాశం కల్పించిన ధర్మారం మండలం పై తనకు ప్రత్యేక గౌరవం ఉంటుందని మంత్రి తెలిపారు. గెలిచినా ఓడిన ధర్మారం మండల ప్రజలు తన వెన్నంటి ఉన్నారని మంత్రి అడ్లూరి అన్నారు. ధర్మారం మండలానికి ఇప్పటికే ఐటిఐ కళాశాల మంజూరు చేశామని, రానున్న రోజుల్లో డిగ్రీ కళాశాల మంజూరుకి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.


ఈ సందర్భంగా గురుకుల పాఠశాల విద్యార్థులకు సైకిళ్ళతో పాటు పరీక్షలకు హాజర ైన విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను మంత్రి అందజేశారు.