BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 09 August 2026, 05:14 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ.....

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
09 Aug, 2026 - 05:14 PM
245 వీక్షణలు

ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ.. జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖ దంపతులు.

ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక ప్రపంచ ఆదివాసీ దినోత్సవం: మంచిర్యాలలో ఘనంగా వేడుకలు

  • ఘనంగా నిర్వహించిన భారీ ర్యాలీ.. జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖ దంపతులు.
  • ఆదివాసీల హక్కులు, సంస్కృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే పిలుపు.

మంచిర్యాల: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివాసీ సోదరులు, సోదరీమణులు నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఐబీ చౌరస్తా నుండి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన భారీ బ్యాలీ / సాంస్కృతిక ర్యాలీని వారు జెండా ఊపి ప్రారంభించారు. ఆదివాసీల సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ సాగిన ఈ ర్యాలీలో నాయకులు ఉత్సాహంగా అడుగులేస్తూ స్థానిక ఆదివాసీలకు సంఘీభావం తెలిపారు.

ఆదివాసీల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం: ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, వారి అనూహ్య సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సమాజ సర్వతోముఖాభివృద్ధికి, వారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

  • "ఆదివాసీల సంస్కృతి మన రాష్ట్ర గర్వకారణం.. వారి హక్కుల పరిరక్షనే మనందరి బాధ్యత" అని ఆయన ఉద్ఘాటించారు.

ఈ వేదికగా మంచిర్యాల ప్రాంతంలోని ఆదివాసీ సోదరసోదరీమణులందరికీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరియు సురేఖమ్మ గారు హృదయపూర్వక ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, పలువురు కార్పొరేటర్లు, వివిధ మండలాల ఆదివాసీ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో గిరిజన యువకులు, మహిళలు పాల్గొన్నారు.