BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 02 June 2026, 03:16 pm
Posted by : కూనురు మధు

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
02 Jun, 2026 - 03:16 PM
530 వీక్షణలు

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కాటం వెంకటేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

​అనంతరం ఆయన మాట్లాడుతూ.. సకల జనుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కొనియాడారు. మరోవైపు పేద ప్రజల సంక్షేమం కోసం ఇందిరమ్మ గృహాలు, ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఉచిత దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అందిస్తూ.. విటమిన్లు, ప్రోటీన్లతో కూడిన స్నాక్స్, రాగిజావ, పాలు ఇస్తూ ఎంతో ప్రోత్సహిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ వల్లే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఉత్తీర్ణత శాతం నమోదైందని సర్పంచ్ హర్షం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరుస సైదులు, పంచాయతీ సెక్రెటరీ ఆర్. కృష్ణయ్య, వార్డు సభ్యులు కురు యాదయ్య, తెల్సూరి నరసింహ, జల ప్రశాంత్, నీలకంఠం, లింగస్వామి, సాగర్ల నాగరాజు, ఏర్పుల వెంకన్న, గణేష్, చేకూరి తదితరులు పాల్గొన్నారు.