BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 11 August 2026, 05:03 pm
Posted by : NTODAY NEWS

హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం

తెలంగాణ
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
11 Aug, 2026 - 05:03 PM
57 వీక్షణలు

హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం

  • ఆగస్టు 16న హైదరాబాద్ జిందాబాద్ కల్చరల్ ఫెస్టివల్–2026
  • ప్రచార పోస్టర్ ఆవిష్కరించిన సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 11 (ఎన్ టుడే న్యూస్):

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “కల్చరల్ ఫెస్టివల్–2026” కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి మంగళవారం రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు.


ఆగస్టు 16న రవీంద్ర భారతి మెయిన్ హాల్‌లో ఈ సాంస్కృతిక ఉత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతులకు నిలయంగా నిలుస్తుందనే స్ఫూర్తితో పాటు స్వాతంత్ర్యోద్యమం, భారత రాజ్యాంగ విలువలను ప్రతిబింబించేలా వివిధ కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


ఈ సందర్భంగా హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి కె. వీరయ్య మాట్లాడుతూ.. 2018 నుంచి ప్రతి సంవత్సరం రవీంద్ర భారతిలో కల్చరల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఉత్సవంలో ప్రముఖ కళాకారుల ఆధ్వర్యంలో పలు ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు.


గురు స్వామి పేరడి, రవూఫ్ స్టాండ్‌అప్ కామెడీ, చొక్కాపు వెంకటరమణ మేజిక్ షో, మౌనిక పప్పెట్ షో, క్రాంతికార్ వెంట్రిలోక్విజం, రామడుగు వసంత్ మైమ్ షో తదితర ప్రత్యేక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నట్లు వివరించారు.


అదేవిధంగా ‘ది ట్రయిల్ ఆఫ్ భగత్ సింగ్’, ‘సే నో టు డ్రగ్స్’, ఆర్గన్ డొనేషన్ వంటి అంశాలపై సందేశాత్మక స్కిట్లు, దేశభక్తిని చాటే నృత్య ప్రదర్శనలు కూడా కార్యక్రమంలో భాగంగా ఉంటాయని తెలిపారు.


మొత్తం 16 ప్రదర్శనల్లో 180 మంది కళాకారులు పాల్గొననున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కళలు, సంస్కృతి, దేశభక్తి, సామాజిక చైతన్యాన్ని కలగలిపి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.


పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్ జిందాబాద్ ఉపాధ్యక్షులు మల్లం రమేష్, పి. శ్రీనివాసరావు, పాండవుల నాగేశ్వరరావు, మోహన్ నాయుడు, గోపాల్, జాయింట్ సెక్రటరీలు సంగీత, కె. లలిత, కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు.