హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ... నంద్యాలజిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు
హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ... నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS .
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ బి. కృష్ణ మోహన్ , జస్టిస్ శ్రీ కె. శ్రీనివాస రెడ్డి , మరియు జస్టిస్ శ్రీ ఎ. హరి హరనాథ శర్మ నందికొట్కూరు టౌన్ నందు అదనపు JFCM కోర్టు ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు.అనంతరం వారితో కలిసి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు
జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ కార్యాలయాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహణ.....
మన ఇంటి లాగే మనం పనిచేసే చోట పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి.....
జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS
ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి 3 శనివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క పిలుపుమేరకు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లు పోలీస్ కార్యాలయాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి శ్రీ హరీష్ కుమార్ గుప్తా IPS గారు ఉత్తర్వులతో, నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు నేడు నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లు పోలీస్ కార్యాలయాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని DCRB, స్పెషల్ బ్రాంచ్, పాస్పోర్ట్ కార్యాలయం, సైబర్ క్రైమ్ , ఫ్యాక్షన్ జోన్ కార్యాలయాలు, సాయుధ బలగాల కార్యాలయాలు, మోటార్ వెహికల్ కార్యాలయం, మరియు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు పోలీస్ కార్యాలయాలలో జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది తమ కార్యాలయాలు మరియు చుట్టు పక్కల ప్రాంగణాలను సమగ్రంగా పరిశుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా మొక్కలను నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధులు నిర్వహించే చోట వాతావరణాన్ని పరి శుభ్రంగా ఉంచుకోవడం సిబ్బంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మన ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా పనిచేసే చోటా పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలు అనగా డెంగ్యూ, మలేరియా విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా ఉంటాయని, పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల
సైబర్ క్రైమ్,రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పలుకూరు గ్రామంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు....
నంద్యాల జిల్లా వ్యాప్తంగా సైబర్ క్రైమ్,రోడ్డు ప్రమాదాల నియంత్రణకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు బనగానపల్లె రూరల్ సర్కిల్ నందివర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుకురు గ్రామం నందు ఇన్స్పెక్టర్ మంజునాథ్ రెడ్డి మరియు సబ్ ఇన్స్పెక్టర్ భూపాలుడు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్బంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారణకు వాహనాల డ్రైవర్ లు స్వీయ నియంత్రణ అనగా తప్పనిసరిగా రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ,ట్రాక్టర్ డ్రైవర్లు, JCB ఆపరేటర్లు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగి గాయాలపాలు అవ్వడమే కాకుండా చనిపోయే ప్రమాదం ఉంది. తద్వారా మీరు మీ కుటుంబం నష్టపోవడమే కాకుండా ఇతర కుటుంబాల వారిని కూడా తీరని నష్టం ఏర్పడే అవకాశం ఉంది.
వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని మరియు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలి.
ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయరాదు, మైనర్ డ్రైవింగ్ పూర్తిగా నిషిద్ధం.
మద్యం సేవించి, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు.
ఆటోలలో నిబంధనల ప్రకారం ప్రయాణికులను,సరుకులను రవాణా చెయ్యాలి.
అతివేగంతో వాహనాలను ఎప్పుడు నడపరాదు.
ట్రాక్టర్ డ్రైవర్లు ఓవర్ లోడ్ నాపరాయి, ధాన్యం, ఇతర సరుకులు మరియు ప్రజలను రవాణా చేయరాదు.
సైబర్ క్రైమ్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మీయొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరూ ఇతరులతో పంచుకోరాదని ముఖ్యంగా ఓటిపి పాస్వర్డ్ మొదలగునవి.
సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ టెలిగ్రామ్ ఇతర సామాజిక మధ్యమాల ద్వారా వచ్చే లింక్ లను,Apk ఫైల్స్ లను డౌన్లోడ్ చేయరాదు.
ఎవరైనా సైబర్ క్రైమ్ నేరగాల్లో చేతిలో మోసపోతే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేసి గాని లేదా మీ పోలీస్ స్టేషన్ నందు లేదా జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద గల సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ని గాని సంప్రదించి సహాయం పొందవచ్చు.
బనగానపల్లె రూరల్ సర్కిల్ కార్యాలయం. నంద్యాల జిల్లా
జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ వజ్రపహార్ కార్యక్రమంలో భాగంగా నేర నియంత్రణే లక్ష్యంగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహణ....
అనుమానితులు, నేర చరిత్ర గలవారు,రౌడీ షీటర్ల ఇళ్లలో సోదాలు.....
చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక...
పోలీస్ వారి సహాయం కొరకు 100/112 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చు.....
నంద్యాల జిల్లా వ్యాప్తంగా నేర నియంతరణ,శాంతిభద్రతల పరిరక్షణ, మాదకద్రవ్యాల నియంతరణ లక్ష్యంగా మరియు ప్రజల రక్షణ వారి భద్రతకు భరోసా కల్పించేందుకు ఆపరేషన్ వజ్రపహార లో భాగంగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు సబ్ డివిజన్ పోలీస్ అధికారుల సూచనలతో పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని సుగాలిమెట్ట గ్రామం మరియు కోవెలకుంట్ల సర్కిల్ పరిధిలోని కంపమల్ల గ్రామం నందు మరియు బేతంచెర్ల టౌన్ నందు మరియు పాములపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగూడూరు గ్రామం నందు ఆయా పోలీస్ స్టేషన్ అధికారులు వారి సిబ్బంది నేటి తెల్లవారుజామున కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరిగింది.
ఈ ఆపరేషన్ లో సరైన ధ్రువపత్రాలు లేని పలు మోటార్ సైకిల్ లకు జరిమాన విధించడంతోపాటు అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తులను అరెస్టు చేసి బాటిల్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ నేరాలను ముందస్తుగా అరికట్టి గ్రామాలలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై నిఘా కొరకు, ప్రజల రక్షణ వారి భద్రతకు పోలీసులు ఉన్నారనే భరోసా కల్పించడం మరియు ప్రతి చోట పోలీసుల నిఘా ఉంటుందని సుస్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవడం ద్వారా అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించవచ్చునని, మరియు నిషేధిత వస్తువుల రవాణా మాదకద్రవ్యాల నియంత్రణ లక్ష్యంతో ఈ సోదాలు నిర్వహించడం జరిగిందన్నారు.
అనుమానాస్పద వ్యక్తులు, రౌడీ షీటర్లు,మరియు నేర చరిత్ర గలవారి ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగిందని, రౌడీషీటర్లకు నేరచరిత్ర గల వారికి అక్కడే కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.
గ్రామంలో ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, చిన్నారులపై జరిగే నేరాలు, బాల్యవివాహాలు మరియు C.C కెమెరాల ప్రాధాన్యత మొదలగు వాటిపై అవగాహన కల్పించడంతో పాటు పోలీసు వారి తక్షణ సహాయం కొరకు 100/112 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి పోలీసు సహాయం పొందవచ్చునని తెలియజేయడం జరిగింది.
జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల