BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 07 February 2026, 09:34 am
Posted by : NTODAY NEWS OFFICIAL

దుర్గాడ గ్రామంలో ఇంటి దొంగతనం

తెలంగాణ
07 Feb, 2026 - 09:34 AM
327 వీక్షణలు
దుర్గాడ గ్రామంలో ఇంటి దొంగతనం బంగారం, వెండి ఆభరణాలు చోరీ – పోలీసుల దర్యాప్తు ప్రారంభం NTODAY NEWS:  గొల్లప్రోలు మండల రిపోర్టర్: బోర శివారెడ్డి దుర్గాడ గ్రామంలో దొంగతన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన వెలుగుల భాస్కరరావు, ఆయన అత్తమామలు కొండేపూడి సూర్యనారాయణ దంపతులు జనవరి 24న పూణేలో నివసిస్తున్న తమ కుమారుడి వద్దకు వెళ్లారు. ఇంటిని చూసుకోవాలని బంధువులకు చెప్పి వెళ్లినట్లు సమాచారం. ఫిబ్రవరి 7 ఉదయం సుమారు 7 గంటలకు ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి చూడగా, ప్రధాన ద్వారం కొద్దిగా తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా, రెండు బెడ్‌రూమ్‌లలోని ఐరన్ బీరువాలు తెరిచి ఉండి, సామాన్లు చిందరవందరగా పడి ఉండటం కనిపించింది. వెంటనే ఇంటి యజమానులకు సమాచారం అందించగా, బీరువాల్లో ఉన్న సుమారు 50 గ్రాముల బరువు గల ఆరు రకాల బంగారు ఆభరణాలు, దాదాపు రెండున్నర కిలోల వెండి వస్తువులు గుర్తుతెలియని దొంగలు చోరీ చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై గొల్లప్రోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందగా, ఎస్సై ఎన్. రామకృష్ణ కేసు నమోదు చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పిఠాపురం సీఐ శ్రీనివాస్‌తో పాటు క్లూస్ టీం ఇన్‌స్పెక్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. #TheftCase #HouseBreakIn #KakinadaDistrict #Gollaprolu #Durgaada #CrimeNews #AndhraPradesh Follow us on Website Facebook Instagram YouTube