BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 06 January 2026, 04:33 am
Posted by : NTODAY NEWS OFFICIAL

హద్దు మీరిస్తే కఠిన చర్యలు తప్పవు

తెలంగాణ
06 Jan, 2026 - 04:33 AM
455 వీక్షణలు

మహిళలు, బాలికలపై హద్దు మీరిస్తే కఠిన చర్యలు తప్పవు

-జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్ NTODAY NEWS: ఉయ్యాలవాడ గ్రామం ఉయ్యాలవాడ గ్రామంలోని గీతాంజలి కళాశాలలో షీ టీం, సైబర్ క్రైమ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, భరోసా విభాగాల ఆధ్వర్యంలో మహిళలు, బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలపై ఎవరైనా హద్దు మీరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు భయంలేకుండా, స్వేచ్ఛగా జీవించేలా సురక్షిత వాతావరణం కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. షీ టీం అవగాహన షీ టీం ఇంచార్జ్ విజయలక్ష్మి మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలపై జరిగే ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, అసభ్య ప్రవర్తన, ఆన్‌లైన్ వేధింపులు, బెదిరింపులపై షీ టీమ్స్ వెంటనే స్పందిస్తాయని తెలిపారు. సహాయం కోసం డయల్ 100 లేదా 8712657676 నంబర్లకు కాల్ చేయవచ్చని, ఫిర్యాదులను గోప్యంగా ఉంచి తక్షణమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ అవగాహన సైబర్ క్రైమ్ ఎస్‌ఐ రమాదేవి “స్టే సేఫ్” అంశంపై మాట్లాడుతూ, ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాల గురించి వివరించారు. ఎలాంటి సైబర్ మోసాలకు గురైనా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేయాలని సూచించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్‌ఐ రజిత మాట్లాడుతూ, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనుమతి లేకుండా మనుషులను బలవంతంగా తీసుకెళ్లడం, అమ్మడం, అవయవాల అక్రమ వ్యాపారం వంటి మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భరోసా సేవలు భరోసా కోఆర్డినేటర్ శ్రీలత భరోసా సెంటర్ ద్వారా మహిళలు, పిల్లల నేర బాధితులకు ఒకేచోట అన్ని సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. లైంగిక వేధింపులు, పోక్సో కేసుల్లో భయంలేని వాతావరణంలో సహాయం, బాధితుల గోప్యత, గౌరవం, భద్రతకు అధిక ప్రాధాన్యతతో పాటు విక్టిమ్ కంపెన్సేషన్ ఫండ్, పునరావాసం, విద్య, ఆరోగ్య సహాయాన్ని అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ సభ్యుడు రవి, షీ టీం సభ్యులు వెంకటయ్య, వెంకట్, కళాశాల ప్రిన్సిపాల్ శరత్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube