www.ntodaynews.com
సర్కారు భూములపై అక్రమాలు అరికట్టాలి
తెలంగాణ
సర్కారు భూములపై అక్రమాలు అరికట్టాలి
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
ఆక్రమిత భూములను స్వాధీనం చేసి పేదలకు పంపిణీ చేస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మారం, మార్చి 01: గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అనర్హుల కబ్జాలోకి వెళ్లిన ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో నిర్వహించిన ‘ఇంటింటికి సోలార్’ పథకం అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
భూ ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్
ధర్మారం మండలంలోని నర్సింగాపూర్, ఖీలావనపర్తి, ధర్మారం గ్రామాల్లో ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమణకు గురయ్యాయని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఆక్రమిత భూములను గుర్తించి సంబంధిత పట్టాలను రద్దు చేయాలని సూచించారు. స్వాధీనం చేసుకున్న భూములను అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
క్రీడా మైదానం అభివృద్ధి
ధర్మారం మండల కేంద్రంలో క్రీడా మైదానానికి కేటాయించిన స్థలాన్ని 15 రోజుల్లోగా చదును చేయాలని ఆదేశించారు. అక్కడ క్రికెట్, వాలీబాల్ కోర్టులతో పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి యువతకు క్రీడా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
100% సోలార్ గ్రామంగా నంది మేడారం
నంది మేడారం గ్రామాన్ని 100 శాతం సోలార్ గ్రామంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందుకు రూ. 51 కోట్లు విడుదలైనట్లు వెల్లడించారు.
తొలి విడతలో 1486 గృహాలకు 2 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు
రెండో విడతలో 628 వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ వ్యవస్థ
విద్యుత్ లైన్ల మార్పిడికి రూ. 36 లక్షలు
తాగునీటి కోసం బోరు బావులు
80 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
ధర్మారం మండలం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు.
#LandEncroachment #SolarVillage #Dharmaram #Peddapalli #WelfareSchemes #TelanganaDevelopment
Follow us on
Website
Facebook
Instagram
YouTube