ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నా
కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా.. భారీగా హాజరైన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు
హైదరాబాద్ | Ntoday News
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ వెయ్యి రోజులుగా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతను నిర్వర్తించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని, తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవడం లేదని పేర్కొంటూ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రజాప్రతినిధుల బాధ్యత అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఆ బాధ్యతలను నిర్వర్తించలేని పరిస్థితి ఉంటే పదవిలో కొనసాగడం సమంజసం కాదని అన్నారు.
మహా ధర్నాకు డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.