BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 19 January 2026, 05:22 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు

తెలంగాణ
19 Jan, 2026 - 05:22 AM
388 వీక్షణలు
తొర్రూరులో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహణ వడ్డీ లేని రుణాల సబ్సిడీ చెక్కుల పంపిణీ NTODAY NEWS: పాలకుర్తి రిపోర్టర్: వేణు తొర్రూరు పట్టణంలోని బీఆర్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (MEPMA) మరియు తొర్రూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల సబ్సిడీ పంపిణీ కార్యక్రమం నిర్వహించగా, పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి మాట్లాడుతూ, మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి సాధించి కుటుంబాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు, సబ్సిడీలు అందిస్తూ వారి జీవితాల్లో భరోసా కల్పిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొర్రూరు పట్టణానికి చెందిన 114 స్వయం సహాయక సంఘాలకు రూ.22,30,982 విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను లబ్ధిదారులైన మహిళలకు అందజేశారు. ఈ రుణాలను ఉపయోగించి మహిళలు చిన్న వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించి ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. మహిళలు సంఘటితంగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని, స్వయం సహాయక సంఘాలు సామాజిక మార్పుకు శక్తివంతమైన వేదికలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఆర్‌డీఏ అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, ఎంపీడీఓ, మెప్మా అధికారులు, తొర్రూరు పురపాలక సంఘ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. #IndiraMahilaShakti #WomenEmpowerment #SHGWomen #InterestFreeLoans #MEPMA #TelanganaGovernment #WomenDevelopment #SelfHelpGroups #UrbanPovertyAlleviation #Torur #FinancialInclusion Follow us on Website Facebook Instagram YouTube