BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 01 March 2026, 02:44 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఇందిరమ్మ బిల్లులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి

తెలంగాణ
01 Mar, 2026 - 02:44 AM
289 వీక్షణలు
ఇందిరమ్మ బిల్లులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ దళారుల ప్రమేయానికి తావులేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం ధర్మారం, మార్చి 01: రాష్ట్రంలో పారదర్శక పాలన అమలులో ఉందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఆదివారం ధర్మారం మండలం గోపాల్ రావు పేట గ్రామంలో తాండ్ర రజిత-గంగయ్యలకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మధ్యవర్తులకు అవకాశం లేకుండా ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేస్తోందని వివరించారు. అదనంగా 2,000 ఇళ్ల మంజూరు మార్చి నెలలో నియోజకవర్గానికి మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గోపాల్ రావు పేటలో మంజూరైన 24 ఇళ్లలో 7 ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి నిధుల ప్రకటన గోపాల్ రావు పేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 20వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అభివృద్ధి కోసం రూ. 10 లక్షల నిధులను ప్రకటించారు. సంఘ భవనాలకు ఆర్థిక సహాయం గ్రామ అభివృద్ధిలో భాగంగా పద్మశాలి సేవా సంఘం నూతన భవనానికి రూ. 5 లక్షలు ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు రూ. 5 లక్షలు మహిళా సంఘాల గోదాం నిర్మాణం కోసం స్థల సేకరణ చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఇటీవల మరణించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు దూడ నర్సయ్య భార్య నర్సమ్మ కుటుంబాన్ని మంత్రి పరామర్శించి సానుభూతి తెలిపారు. #IndirammaHouses #WelfareSchemes #TransparentGovernance #Dharmaram #TelanganaDevelopment #HousingForAll Follow us on Website Facebook Instagram YouTube