BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 18 September 2026, 06:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు నరసాపురం విద్యార్థిని ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 06:24 AM
41 వీక్షణలు

విస్సన్నపేట, సెప్టెంబర్ 17: ఏలూరు జిల్లా? కాదు — ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ఉమ్మడి తరుణవేణి జాతీయస్థాయి సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో తరుణవేణి ప్రతిభ కనబరిచింది. ఆమె ఆటతీరును గుర్తించిన ఎంపిక కమిటీ జాతీయస్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పాఠశాల వ్యాయామోపాధ్యాయులు మేరుగు రమేష్ తెలిపారు.

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో జరగనున్న జాతీయస్థాయి సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో తరుణవేణి ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయస్థాయిలో రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలనే లక్ష్యంతో ఆమె సిద్ధమవుతోంది.

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ సబ్‌జూనియర్ బాలికలకు నరసాపురంలో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎంపికైన క్రీడాకారిణులు సెప్టెంబర్ 18 నుంచి 25వ తేదీ వరకు వారం రోజులపాటు నరసాపురంలో శిక్షణ పొందనున్నారు.

గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థినిని క్రీడల్లో ప్రోత్సహించి జాతీయస్థాయికి తీసుకెళ్లిన వ్యాయామోపాధ్యాయులు మేరుగు రమేష్‌ను ప్రముఖ నాయకులు గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎస్. శోభాలత అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లోనూ తరుణవేణి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.