BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 02 July 2026, 06:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్యాన్సర్‌పై అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 06:21 PM
131 వీక్షణలు


ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం  చాట్రాయి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం (02-07-2026) విద్యార్థులకు క్యాన్సర్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నూజివీడు రోటరీ క్లబ్ సౌజన్యంతో, హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యుల సహకారంతో నిర్వహించారు.

ఈ సందర్భంగా వైద్య నిపుణులు విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యత, పొగాకు మరియు ఇతర హానికర అలవాట్ల వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వైద్యులు సమాధానాలు ఇస్తూ ఆరోగ్య అవగాహన పెంపొందించడానికి అవసరమైన సూచనలు అందించారు. కార్యక్రమంలో నూజివీడు రోటరీ క్లబ్ సభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్య బృందం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.