BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 05 April 2026, 02:07 pm
Posted by : యామనూరి మల్లికార్జున

నంద్యాలలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
05 Apr, 2026 - 02:07 PM
157 వీక్షణలు

నంద్యాలలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు

ఘనంగా నివాళులర్పించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఏఎస్పీ మంద జావలి అల్ఫోన్స్‌

నంద్యాల, ఏప్రిల్ 05: 

భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు ఆదివారం నంద్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని విక్టోరియా రీడింగ్ రూమ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ , జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, నంద్యాల ఏఎస్పీ మంద జావలి అల్ఫోన్స్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్  మాట్లాడుతూ దేశాభివృద్ధిలో, ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదని . స్వాతంత్ర్య పోరాటంలోనూ, అనంతరం కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని  అన్నారు . బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షకుడిగా ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు 

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతిని నిర్వహించడం సంతోషకరమని, ఆయన చూపిన బాటలో సామాజిక సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రతిభా ఘనపరిచిన విద్యార్థినిలకు బహుమతులు అందజేశారు అలాగే బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా భారీ కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు 

ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం అధికారులు, ప్రజా ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.