BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 17 April 2026, 07:43 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Apr, 2026 - 07:43 PM
167 వీక్షణలు

మదనపల్లె: జలవనరుల అభివృద్ధి, రైతుల సంక్షేమం లక్ష్యంగా జిల్లాలో చేపడుతున్న జలధార–జలహారతి పనులను సమగ్ర ప్రణాళికతో, నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు స్పష్టం చేశారు. మదనపల్లెలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువులు, వాగులు, కాలువల నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించడం అత్యంత కీలకమని అన్నారు. ఒక చెరువు నిండిన తర్వాత మరొక చెరువుకు నీరు సాఫీగా చేరే విధంగా సమగ్ర వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. దీని ద్వారా భూగర్భ జలాల స్థాయి పెరిగి, సాగునీటి లభ్యత మెరుగుపడుతుందని తెలిపారు.

పూడికతీత పనులను వేగవంతం చేయడంతో పాటు కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నచోట వాటిని తొలగించే చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పనుల్లో నరేగా కార్మికులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా సూక్ష్మ సేద్యం, ఉద్యాన సాగు వంటి విధానాలను ప్రోత్సహించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గిస్తూ అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు.

జిల్లాలో జలవనరుల సంరక్షణ, వినియోగంలో సమన్వయం కల్పిస్తే రైతులకు దీర్ఘకాలిక లాభాలు చేకూరుతాయని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.