BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 11 August 2026, 01:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జమలాపురం వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద గోమాత చిత్రపటాలు, హనుమాన్ చాలీసా పుస్తకాల పంపిణీ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Aug, 2026 - 01:18 PM
210 వీక్షణలు

ఎర్రుపాలెం: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద మంగళవారం భక్తులకు గోమాత చిత్రపటాలు, హనుమాన్ చాలీసా పుస్తకాల పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆలయానికి విచ్చేసిన భక్తులు విశేషంగా స్పందించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ నిర్వాహకుడు వేమవరపు హనుమంతరావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో గోసేవకు అత్యంత విశిష్టమైన స్థానం ఉందని తెలిపారు. గోవును గోమాతగా భావించి పూజించడం అనాదిగా వస్తున్న ఆచారమని పేర్కొన్నారు. గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనని మన పురాణాలు, ఋషులు తెలియజేశారని వివరించారు.

గోమాతను ప్రత్యక్షంగా పూజించే అవకాశం లేని భక్తులు గోమాత చిత్రపటాన్ని భక్తిశ్రద్ధలతో పూజించవచ్చని హనుమంతరావు తెలిపారు. గోమాతను పూజించడం ద్వారా ఆధ్యాత్మిక చింతన పెంపొందడంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల భక్తుల్లో అవగాహన మరింత బలపడుతుందని పేర్కొన్నారు. గోసేవ, ధర్మాచరణ, ఆధ్యాత్మిక భావనలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా భక్తులకు హనుమాన్ చాలీసా పుస్తకాలను కూడా పంపిణీ చేశారు. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు హనుమాన్ చాలీసా పుస్తకాలను స్వీకరించి భక్తిశ్రద్ధలతో పారాయణం చేయాలని కోరారు.

నాలుగువందలకు పైగా గోమాత చిత్రపటాల పంపిణీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలానికి చెందిన దాత కుందా కోటేశ్వరరావు అందజేస్తున్న గోమాత చిత్రపటాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు పంపిణీ చేస్తున్నట్లు శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు తెలిపారు. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లో నాలుగువందలకు పైగా గోమాత చిత్రపటాలను భక్తులకు అందజేసినట్లు వెల్లడించారు.

గోమాత చిత్రపటాల పంపిణీతో పాటు హనుమాన్ చాలీసా పుస్తకాలను భక్తులకు అందించడం ద్వారా ఆధ్యాత్మిక భావనలను, సనాతన సంప్రదాయాలను ప్రజల్లో మరింతగా పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. భక్తి, సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, ఆలయానికి విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు. గోమాత చిత్రపటాలు, హనుమాన్ చాలీసా పుస్తకాలను భక్తులు భక్తిశ్రద్ధలతో స్వీకరించారు.